నాని ఎప్పుడు నవ్వుతూ పక్కనున్న వారిని నవ్విస్తూ కనిపిస్తుంటాడు.
అలాంటి నాని ఈ మధ్య ఒక విషయంలో బాగా కోపం తెచ్చుకున్నాడు అని సమాచారం. అదేంటంటే- నానికి వీరాభిమానులైన కొంతమంది ఒక ట్విట్టర్ పేజి ఓపెన్ చేసి అందులో నాని గురించిన ఫిలిం అప్డేట్లు పెడుతుంటారు.
ఇంతవరకు బాగానే ఉన్న, ఈ మధ్యకాలంలో ఆ పేజీలో వేరే హీరోల పైన నెగటివ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేయడం గమనించిన నాని ఈ విషయమై తీవ్రంగా స్పందించాడు.
దయచేసి ఇలాంటి కామెంట్స్ చేయడం మంచిదికాదు అని అలాగే వేరే హీరోల పై వాడే భాష కూడా సరిగా లేదని , ఒకవేళ ఇదే గనుక కంటిన్యూ చేస్తే తన ఫోటోని ఆ పేజీ నుండి తీసేయాలని హెచ్చరించాడు.
అసలే సోషల్ మీడియా పెరిగాక హీరోల అభిమానులు తమ పరిది మించి ప్రవర్తిస్తున్నారు అనేది నిర్వివాదాంశం.