గత రెండేళ్లుగా నాని కెరీర్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిపోతోంది. నాని ఏది పడితే అదే బంగారమైపోతోంది. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రతీ సినిమా హిట్టే. ఒక సినిమాకీ మరో సినిమాకీ అస్సలు పొంతన లేకుండా కామన్ సబ్జెక్ట్ ్స అయినా కానీ తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు నాని. తాజాగా 'నేను లోకల్'తో హిట్ కొట్టాడు. ఈ సినిమా విజయంతో నాని జోరుకి ఇక బ్రేకుల్లేవ్ అని అర్ధమైపోయింది అందరికీ. ఇకపై నానిని చిన్న హీరోగా లెక్కేయకూడదు. స్టార్ హీరో అయిపోయినట్లే అంటున్నారు సినీ ప్రముఖులు. ఇంతవరకూ నాని సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ సినిమా అనే అంచనా వేసేవారు. కానీ ఇప్పుడలా కాదు. ఖచ్చితంగా లాభాలు తెచ్చే సినిమా నాని సినిమా అనే రేంజ్‌కి వచ్చేశాడు. 'నేను లోకల్' సినిమాతో నాని నటనలో చాలా ఇంప్రూవ్ అయ్యాడంటున్నారు సినీ విశ్లేషకులు. అంటే నేచురల్‌గానే నాని నటన ఆకట్టుకునేలా ఉంటుంది. చాలా ఈజ్‌తో నటించేస్తాడు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా. ఈ సినిమాలో నాని ఇంకా బాగా ఆకట్టుకున్నాడు. యంగ్ హీరో అనే ట్యాగ్‌ని పక్కన పెట్టేసి నాని కూడా స్టార్ హీరోల జాబితాలోకి వెళ్లదగ్గవాడేనని ప్రూవ్ చేసేసింది ఈ సినిమా. అన్నట్లు నానికి నెగిటివ్ రోల్స్‌లో కూడా నటించాలనుందంటున్నాడు. అది కూడా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించాలట. ఏమో నానికి సాధ్యం కానిది ఏదీ లేదు. తన యాక్టింగ్ టాలెంట్‌తో ఎంతగా నవ్విస్తాడో, అలాగే ఏడిపించడానికీ, భయపెట్టడానికీ కూడా నాని తగినవాడే.