పెళ్ళి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రితు వర్మ. ఆ సినిమాలో తను చూపిన పెర్ఫార్మన్స్ కి ఒక బంపర్ ఆఫర్ తగిలింది.
అదేమిటంటే, గౌతం మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే మెగా ఛాన్స్ కొట్టేసింది రితు వర్మ. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, పెళ్ళి చూపులు సినిమాలో రితు యాక్టింగ్ కి ఫ్లాట్ అయిపోయి ధృవ నచ్చిత్రంలో ఈ ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.
అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ ని మరి ఈ మిల్కీ బ్యూటీ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ కి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
కొసమెరుపు ఏంటంటే గౌతం మీనన్ పెళ్ళి చూపులు సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు.