బిగ్ బాస్ హౌస్ లో స్నేహాలు ఎంతగా ఉంటాయో కోపాలు, వెన్నుపోట్లు, గొడవలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అసలు సంబంధం లేని వ్యక్తులని ఒక 100 రోజులు ఒకే ఇంట్లో పెడితే వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనే పాయింట్ పైనే ఈ రియాలిటీ షో నడుస్తుంది.
ఇక బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ రెండవ వారం ఈరోజుతో ముగియనుంది. ఈ తరుణంలో ఈ వారం జరిగిన సంఘటనల పైన ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాని కాస్త అసహనానికి గురయ్యాడు. దానికి కారణం నూతన్-సామ్రాట్, నూతన్-తనీష్, తనీష్-కౌశల్, దీప్తి సునైనా & కిరీటి వ్యవహరించిన విధానమే.
అయితే దీప్తి సునైనా, కిరీటి ల ప్రవర్తన పైనే నాని ఎక్కువగా మాట్లాడడం వారి ప్రవర్తన ఎంత తప్పుగా ఉందొ అన్నది వారికే వీడియోల రూపం లో చూపించే పద్ధతి మార్చుకొమ్మని సూచన కూడా చేశాడు. ఇక కిరీటి ని మాత్రం అతను చేసిన పనికి ఒకవేళ నామినేషన్ లో ఉంది ఉంటె కచ్చితంగా ప్రేక్షకులు ఎలిమినేట్ చేసి ఉండేవారు అని చెప్పి ఒక షాక్ ఇచ్చాడు.
ఇకపోతే రెండు వారలే అవ్వడం అంతలోనే గ్రూపులు కట్టడం వంటివి కూడా ఏమాత్రం బాగాలేదు అంటూ సున్నిత్తంగా హెచ్చరించే పని చేశాడు. ఏదేమైనా ఇప్పుడు మాట్లడుతున్నది హీరో నాని కాదు బిగ్ బాస్ హోస్ట్ నాని అంటూ ఒకింత కటువుగానే ఉండే ప్రయత్నం చేశాడు.
ఈ వారం ఎలిమినేషన్ నుండి దీప్తి సునైనా, బాబు గోగినేని బయటపడగా ఈరోజు కౌశల్, గణేష్ & నూతన్ లలో ఏ ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళతారో అన్నది ఈ రాత్రికి తేలిపోనుంది...
మొత్తానికి ఇప్పుడిప్పుడే ఈ సీజన్ రసవత్తరంగా మారే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వస్తున్నది ప్రేక్షకుల్లో....