దసరా టీజర్ లో బాంచత్ అనే మాట వినిపించింది. ఈ పదం, ఆ సౌండింగ్ పై కొందరు విమర్శలు చేశారు. అయితే దీనిపై నాని వివరణ ఇచ్చారు. బాన్చత్ అనే మాట ఎవరూ తిట్టడానికి వాడరు. తెలంగాణ ఆ మాటని ‘చూసుకుందారా.. తేల్చుకుందాంరా.. అనే సందర్భంలో వాడుతారు. తెలంగాణ లో ఆ మాటని తరతరాలుగా ఏ ఎమోషన్ కి వాడుతున్నారో ఆ ఎమోషన్నే తీసుకుందాం. అంతేకానీ నార్త్ ఇండియా లో దిని మీనింగ్ ఇంకోటి వుందనే అర్ధంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చారు.
ఇదే సందర్భంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తో దసరాని పోల్చడం గురించి కూడా వివరణ ఇచ్చారు. దసరా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లా అంటే ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు చేస్తుందని కాదు.. నా ఉద్దేశం ఏమిటంటే ఆ ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలివి. అలా ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చే గర్వించదగ్గ సినిమా దసరా. ఇదే మాట మార్చి 30 వరకూ చెబుతూవుంటాను. మార్చి 30 తర్వాత మీరు చెప్పండి కరెక్టో కాదో’’ అన్నారు నాని.