శ్యామ్ సింగా రాయ్ విడుదల సమయంలో టికెట్ రేటు విషయంలో హీరో నాని చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. రాజకీయంగా కూడా వేడి ఎదుర్కున్నారు నాని. సినిమా కౌంటర్ కంటే కిరాణ షాప్ కలెక్షన్ ఎక్కువగా వుందని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. నిర్మాతలే తమ సినిమా రేట్లు తగ్గించామని కొత్త ప్రచారం చేస్తున్నారు. దీంతో నానిపై మళ్ళీ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. టికెట్ రేటు ఇంకో 500వందలు పెంచుకోండి నాని గారు అని కామెంట్లు కనిపించాయి.
ఐతే ఈ మొత్తం వివాదంపై క్లారిటీ ఇచ్చారు నాని. ''నేను టికెట్ రేట్లు పెంచమని చెప్పినపుడు సందర్భం వేరు. బేసిక్ రేట్లు కంటే బాగా తగ్గించి టికెట్ మరీ పది, ఇరవై రూపాయిలు చేసినప్పుడు .. ఈ ఇంత తక్కువ ధరతో సినిమా ఆడించడం కష్టం సాదారణ రేట్లు పెట్టమని కోరారు. కానీ ఆ సందర్భంను మర్చిపోయి ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను టికెట్ రేటు పెంచమని ఎప్పుడూ అడగలేదు. బేసిక్ రేట్లు పెట్టమనే కోరాను. ఆ సందర్భంను మర్చిపోయి ఏదిపడితే అది కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా'' అని చెప్పుకొచ్చారు నాని. నిజమే .. నాని మాటల్లో వాస్తవం వుంది. టికెట్ రేటు మరీ తగ్గించేసినపుడు ఈ రేట్లతో సినిమా బ్రతకడం కష్టమని చెప్పారు కానీ రేట్లు పెంచమని మాత్రం ఎప్పుడూ అడగలేదు.