హీరోగా వరుస హిట్లు అందుకుంటున్న నాని నిర్మాతగా కూడా వరుస హిట్లు తనఖాతాలో వేసు కుంటున్నాడు. నాని జడ్జ్ మెంట్ పై అందరికీ నమ్మకం ఏర్పడేలా చేసుకున్నాడు. కోర్టు మూవి పై మొదట పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన తరవాత నాని చేసిన కామెంట్స్ తో కోర్టు పై హైపు ఏర్పడింది. కోర్టు మూవీ మీకు నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అని నాని డేరింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనితో కోర్టు పై అంచనాలు పెరిగాయి. మొత్తానికి కోర్టు రిలీజ్ అవటం హిట్ 3 సేఫ్ అవటం జరిగింది.
కోర్టు సినిమా రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేయగా పాజిటీవ్ టాక్ తో జనాల్లోకి విస్తృతంగా వెళ్ళింది. శివాజీ, ప్రియదర్శి నటనతో కోర్టు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 121 వేల టికెట్స్ బుక్ మైషోలో సేల్ అయ్యాయి. కోర్టు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 8.10 కోట్లు కలక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా మొదటి రోజే ఇలా 8 కోట్లకి పైగా కలక్ట్ చేయటం విశేషం.
కోర్టు టికెట్స్ యూఎస్ లో కూడా 200k మార్కును దాటినట్లు సమాచారం. ఈ వారం చివరికి 500K దాటుతుంది అని అంచనా. ఈ వీకెండ్ లో కోర్టు వసూలు డబుల్ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల అంచనా. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే OTT డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ 8 కొట్లకి కోర్టు హక్కుల్ని సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ ని ఈటీవి విన్ 2.5 కోట్లకి తీసుకుంది. ఈ మూవీకి నాని 19 కోట్ల బడ్జెట్ పెట్టగా అప్పుడే 19 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై వచ్చేది అంతా లాభాల కింద లెక్కే.