నానికి ఊహించని ఓపెనింగ్స్ దక్కాయి. దసరా బాక్సాఫీసు దగ్గర దడదడలాడిస్తోంది. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన దసరాకి అనూహ్యమైన ఓపెనింగ్స్ దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.38 కోట్ల గ్రాస్ వచ్చినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా రూ.25 కోట్లు వచ్చాయి. నైజాంలోనే అత్యధికంగా రూ.13 కోట్లు తెచ్చుకొంది. నాని కెరీర్‌లో ఇదే రికార్డు.
ఈ సినిమా దాదాపుగా రూ.50 కోట్ల బిజినెస్ చేసుకొంది. ఇదే జోరు కొనసాగితే... ఆ డబ్బులు వెనక్కి రాబట్టడం మంచి నీళ్ల ప్రాయం. పైగా ఈ సినిమా గురువారం వచ్చింది. లాంగ్ వీకెండ్ దక్కింది. బాక్సాఫీసు దగ్గర వేరే సినిమాలేం లేవు. పరీక్షలు కూడా అయిపోయాయి. విద్యార్థులకు ఇప్పుడు దసరా ఒక్కటే ఆప్షన్. రిలీజ్ డే రోజున మంచి టాక్ వచ్చింది. సో.. ఈ వారం అంతా.. దసరా హంగామా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నాని టార్గెట్ రూ.100 కోట్ల వైపు ఉంది. అన్నీకుదిరితే.. ఈ సినిమా రూ.100 కోట్లు దక్కించుకోవడం ఈజీనే. అదే జరిగితే నాని కూడా వంద కోట్ల హీరో అయిపోతాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు.
#Dasara emerges as the #1 MOVIE at the Indian Box Office with a gross of 38 CRORES+ on Day 1 💥💥
— SLV Cinemas (@SLVCinemasOffl) March 31, 2023
- https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbusterDasara
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/tD2icNehv5