ఆ గాసిప్‌తో నాని బాగా హర్టయ్యాడు

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమకీ గాసిప్స్‌కీ విడదీయరాని సంబంధం ఉంది. ఆ సినిమాలో ఈ హీరో అట..ఈ సినిమాలో ఆ హీరోయిన్‌ అట. పలానా హీరోయిన్‌తో, పలానా హీరో లవ్‌లో పడ్డాడట.. 

ఇలాంటి గాసిప్స్‌ సర్వ సాధారణంగా వింటూనే ఉంటాం. అయితే వీటిలో కొన్ని గాసిప్స్‌ నిజమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిజం కాకపోనూ వచ్చు. ఈ గాసిప్స్‌ హెల్దీ గాసిప్స్‌ అయినంత వరకూ ఏ సమస్యా ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో గాసిప్స్‌ శృతిమించి పోతున్నాయి. అవి సెలబ్రిటీస్‌ వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ మధ్య ముద్దుగుమ్మ నమిత సీనియర్‌ హీరో శరత్‌కుమార్‌ని వివాహం చేసుకోబోతోందంటూ వచ్చిన గాసిప్‌ అర్ధం లేనిదే. శరత్‌బాబు వయసేంటి? నమిత వయసేంటి.? అందుకే ఈ గాసిప్‌ విషయంలో ఈ ఇద్దరూ ఘాటుగానే స్పందించారు. 

అలాగే తాజాగా నేచురల్‌ స్టార్‌ నానిపై వస్తున్న గాసిప్స్‌ కూడా పక్కదారి పట్టాయి. నాని అంటే మన పక్కింటి అబ్బాయి. ఇంతవరకూ ఎలాంటి మచ్చ లేనివాడు ఇండస్ట్రీలో. సినిమా, కెరీర్‌ తప్ప మరో ఆలోచన లేని బుద్దిమంతుడులాంటోడు నాని. అలాంటిది నాని ఓ హీరోయిన్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ వస్తున్న గాసిప్స్‌ బాధాకరం. అందుకే నాని కొంచెం ఘాటుగా స్పందించాడు ఈ గాసిప్స్‌పై. మొదట్లో ఈ గాసిప్స్‌ ని లైట్‌ తీసుకున్నాడట నాని. కానీ ఆ గాసిప్స్‌ ఇంకా ఇంకా ఆగకపోవడంతో మరీ వ్యూస్‌ కోసం ఇంత దిగజారిపోతారా అని వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటున్నాడు.

ఇదిలా ఉండగా, నాని, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎంసీఏ - మిడిల్‌క్లాస్‌ అబ్బాయి'. ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి నటనలకు ఆకాశమే హద్దనేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆ విషయాన్ని ప్రూవ్‌ చేస్తున్నాయి. రొటీన్‌ కాన్సెప్టే కానీ డైరెక్టర్‌ కథలో ఏదో కొత్తదనం చూపించనున్నాడట. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS