ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అయిన మిర్యాల రవీందర్ రెడ్డి పైన అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
వివరాల్లోకి వెళితే, ఆయన సంతకం చేసి ఇచ్చిన రూ 50 లక్షల చెక్కు బౌన్సు అయిందంటూ ఆయన పై కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి ఆయనకీ కోర్టు ద్వారా పలుమార్లు విచారణకి హాజరు కావాల్సిందిగా ఆయనకీ సమన్లు పంపించారట.
అయితే వాటికి ఆయన స్పందించకపోవడం అలాగే కోర్టుకి సైతం రాకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనితో ఆయన చిక్కులో పడినట్టయింది.
ఇక ఈ అంశం పై ఆయన స్పందించాల్సి ఉంది. ఈయన గతంలో చైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని నిర్మించగా తాజాగా జయ జానకి నాయక చిత్రాన్ని నిర్మించారు.