హౌస్ మేట్స్ కి నాని ఐస్ ఛాలెంజ్

By iQlikMovies - July 15, 2018 - 12:29 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ రోజు ఆసక్తికరంగానే సాగినా వారాంతంలోకి వచ్చేసరికి ఆ ఆసక్తి రెండింతలుగా మారుతుంది. దానికి కారణం బిగ్ బాస్ హోస్ట్ గా నాని. ఇక నిన్న నాని బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడి కాస్త హల్చల్ సృష్టించాడు అనే చెప్పాలి.

ఈవారం పాటు ఇంటి సభ్యులు ఇంటిలో ప్రవర్తించిన తీరుని విశ్లేషిస్తూ అందరిని ఒకరకంగా కాస్త మందలించాడు అనే చెప్పాలి. ఇక ఎపిసోడ్ ప్రారంభంలో సెల్ఫ్ నామినేషన్ చేసుకునందుకు తిట్టినా చివరకి వచ్చేసరికి కేక్, బిర్యానీ పంపించి గణేష్ పుట్టినరోజుని జరిపించాడు నాని.

 

ఇక అసలు సిసలైన ఎలిమినేషన్ ఈరోజు జరగనుంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదలైంది, అందులో పార్టిసిపెంట్స్ కి ఐస్ ఛాలెంజ్ ఇచ్చి వారితో ఒక ఆట ఆడుకున్నట్టుగా మనకి ఆ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

మరి పార్టిసిపెంట్స్ ని ఈరోజు నాని ఇంకెన్ని ముప్పుతిప్పలు పెట్టాడు అన్నది ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS