'తొలి సినిమా నటుడిగా సంతృప్తినిచ్చింది. ఈ రకమైన రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఏదో చిరంజీవి అల్లుడిని కాబట్టి ముందూ వెనకా ఆలోచించకుండా ఈ రంగంలోకి వచ్చేయలేదు. చిన్నతనం నుండీ యాక్టింగ్ అంటే ఎంతో ప్యాషన్ ఉంది. ఆ స్పెషల్ ఇంట్రెస్ట్‌తోనే నటన వైపు ఆశక్తి చూపించాను..' అని చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ అంటున్నాడు.
నిజానికి బాలీవుడ్‌లో సినిమాలు ట్రై చేశాడట కళ్యాణ్‌దేవ్. కానీ కుదరలేదట. చిన్నతనం నుండీ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాడట. నటుడిగా ఎదగాలనుకున్న వారు ప్రతీ ఒక్కరూ చిరంజీవి లైఫ్‌ని ఇన్సిప్రేషన్‌గా తీసుకోవడం సహజమే. అయితే అల్లుడిగా కళ్యాణ్‌దేవ్‌కి ఆ కల కాస్త ఈజీగా నెరవేరిందంతే అని చెప్పాలి.
ఇటీవలే కళ్యాణ్‌దేవ్ హీరోగా 'విజేత' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలి సినిమా అయినా అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నప్పటికీ, నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసి, మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలన్నదే తన కోరిక అంటున్నాడు.
అయితే రీమేక్‌లు, రీమిక్స్‌ల వంటి వాటి జోలికి పోనంటున్నాడు కళ్యాణ్‌దేవ్. యాక్షన్ సినిమాలంటే ఇష్టమంటున్నాడు. యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీలతో పాటు, డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీల్లోనూ నటిస్తానంటున్నాడు కళ్యాణ్‌దేవ్.