'స్టూవర్ట్‌పురం'లో నాని ఆ పని చేస్తాడా?

By iQlikMovies - June 07, 2018 - 17:46 PM IST

మరిన్ని వార్తలు

'స్టూవర్ట్‌పురం' ఈ పేరు బాగా విన్నట్లుందే అనుకుంటున్నారుగా. అవును దొంగలకు ఫేమస్‌ అయిన ఊరు అది. ఆంధ్రప్రదేశలోని ఓ చిన్న పల్లెటూరు. ఆ ఊరు పేరు వింటే జనాలకు హడల్‌. చేతులు తిరగిన గజదొంగలు సంచరించే ఊరు మరి అది. 1970ల్లో ఆ ఊరిలో పేరు మోపిన గజదొంగ టైగర్‌ నాగేశ్వర్‌రావు. ఇప్పుడెందుకు ఈ గజదొంగ డీటెయిల్స్‌ అనుకుంటున్నారా? చెప్పుకోవాలి. 

ఈ గజదొంగ బయోపిక్‌ ఇప్పుడు వెండితెరపై సందడి చేయబోతోందట. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాని తెరకెక్కించిన వంశీకృష్ణ ఈ గజదొంగ గారి బయోపిక్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఈ పాత్ర పోషించేదెవరనుకుంటున్నారా? నేచురల్‌ స్టార్‌ నాని. అవాక్కయ్యారా? నేచురల్‌ స్టార్‌ నానితో ఈ బయోపిక్‌ విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయట. నాని కూడా ఈ ప్రాజెక్ట్‌పై సుముఖంగా ఉన్నట్లేనని తెలుస్తోంది. అయితే నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ క్యారెక్టర్‌లో నానిని ఊహించుకోగలమా? అనేదే ప్రశ్న. 

అయితే ఎప్పటి నుండో నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేయాలని నాని కోరిక. ఆ కోరిక ఒకవేళ ఈ సినిమాతో తీర్చుకోవాలనుకుంటున్నాడేమో నాని. అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. చూడాలి మరి నాని ఈ పాత్రలో నటిస్తాడన్నది ఎంత నిజమో. ఇకపోతే మరోవైపు నాని, నాగార్జునతో ఓ మల్టీ స్టారర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాని డ్టార్‌గానూ, నాగార్జున డాన్‌ పాత్రలోనూ కనిపించనున్నారనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS