'ఆట' మొదలెట్టనున్న నేచురల్‌ స్టార్‌

మరిన్ని వార్తలు

ఏడాదికి మూడు, లేదంటే నాలుగు సినిమాలతో అలరించే నాని దూకుడు ఈ ఏడాది కాస్త తగ్గిందనే చెప్పాలి. లేటెస్టుగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమా నాని దూకుడుకు అడ్డుకట్ట వేసింది. రాకెట్‌ స్పీడుతో దూసుకెళ్తోన్న నాని కెరీర్‌కి చిన్న బ్రేక్‌ తెచ్చింది. అయినా ఏం ఫర్వాలేదంటున్నాడు. 'కృష్ణార్జున యుద్ధం' ఫెయిల్యూర్‌ మూవీ అని నాని స్వయంగా ఒప్పేసుకున్నాడు. అందుకే తన నుండి మరో మంచి సినిమా రావాలని ఆశించే అభిమానుల కోసం నాని ఓ తీపి కబురు చెప్పనున్నాడు.

ప్రస్తుతం నాగార్జునతో నాని మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, తాజాగా మరో కొత్త చిత్రానికి నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. 'మళ్లీరావా' చిత్రంతో అంతవరకూ ఫెయిల్యూర్స్‌లో ఉన్న అక్కినేని హీరో సుమంత్‌కి ఫీల్‌ గుడ్‌ సక్సెస్‌నిచ్చిన డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి, నానికి ఓ అదిరిపోయే స్టోరీ చెప్పాడట. ఈ స్టోరీ వినగానే నానికి తెగ నచ్చేసిందట. తన బాడీలాంగ్వేజ్‌కి తగ్గ స్టోరీ కావడంతో వెంటనే ఓకే చేసేశాడట నాని. ఇంతకీ ఈ సినిమాకి టైటిల్‌ ఏంటో తెలుసా? 'జెర్సీ'.

లేటెస్టుగా ఈ టైటిల్‌ లోగోని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. లోగోపై 'అర్జున్‌ జెర్సీ నెంబర్‌ 36' అని మెన్షన్‌ చేసి ఉంది. క్రికెట్‌ కిట్‌కి సంబంధించిన యాక్సెసరీస్‌ ఉన్నాయి. అంటే ఇది క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రంగా భావించాలి. గతంలో నాని స్పోర్ట్స్‌ నేపథ్యంలో 'భీమిలి కబడ్డీ జట్టు' చిత్రంలో నటించాడు. అది అంతగా కలిసి రాలేదు అప్పట్లో నానికి. కానీ ఇప్పుడు నాని స్టార్‌డమ్‌ వేరు. సో 'జెర్సీ' నానికి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలిక. ప్రస్తుతం బుల్లితెరపై నాని 'బిగ్‌బాస్‌ 2'కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS