వెబ్‌సైట్స్‌లో హీరోయిన్స్ ఫోటోలు పెట్టి విచ్చలవిడిగా డబ్బులు దండేస్తున్నారు. ఈ హీరోయిన్‌కి ఇంత, ఈ హీరోయిన్‌కి అంత అని రేటు ఫిక్స్ చేసి, ఎట్రాక్ట్ చేయడం, విచ్చలవిడిగా వేలు, లక్షలు సంపాదించేస్తున్నారు. ఈ విషయంలో సదరు సెలబ్రిటీటు చాలా బాధపడుతున్నారు. వారికి సంబంధం లేకుండానే ఇదంతా జరుగుతోంది. తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయనీ, ఈ విషయమై నటి అపూర్వ మీడియా ముందుకొచ్చింది.
ఇలా సెలబ్రిటీల ఫోటోలు పెట్టి, డబ్బులు దండుకుంటున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెబ్ సైట్‌లో హీరోయిన్స్ ఫోటోలు పెట్టి, మోసం చేస్తున్న ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటనల్లో ఒక్క అపూర్వలాంటి వారే కాదు, సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు స్పందించాలి. సినిమాల్లో హీరోయిన్స్‌గా గ్లామర్ ప్రదర్శించడమనేది వారి వృత్తి. వృతి వేరు. ప్రవృత్తి వేరు. వృత్తి రీత్యా గ్లామర్ ప్రదర్శించినా, వారి ప్రమేయం లేకుండానే ఇలా వారి పర్సనల్ లైఫ్‌ని కించపరిచే వారిని క్షమించకూడదు.
ఇలాంటి అకృత్యాలను అస్సలు ప్రోత్సహించకూడదు. సెలబ్రిటీలు కూడా మనుషులే కదా. వారికీ కుటుంబాలుంటాయి. సెంటిమెంట్లుంటాయి. అందుకే ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకుండా, సోషల్ మీడియా వేదికగా, హీరోయిన్స్‌పై వారికి తెలియకుండానే జరిగే ఈ పరోక్ష అత్యాచారాన్ని ఖండించే దిశగా ఇండస్ట్రీ మొత్తం ముందుకు రావాలి