వరుసగా దాదాపు 8హిట్స్ తో హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్న నాని తాజాగా తాను ద్వీపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.
ఇక ఈ చిత్రంలో నాని- కృష్ణ & అర్జున్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు. చిత్తూరుకి చెందిన కుర్రాడిగా కృష్ణ పాత్రలో నాని ప్రేక్షకులని బాగానే ఆదరించాడు అని చెప్పాలి. రాయలసీమ అందులోను చిత్తూరు యాసతో ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు.అయితే కృష్ణ పాత్రతో పోలిస్తే అర్జున్ పాత్ర తేలిపోయింది అనే చెప్పాలి. రాక్ స్టార్ గెటప్ లో నాని అంతగా ఆకట్టుకోలేకపోయాడు, అదే విధంగా యాక్షన్ సన్నివేశాలు కూడా ఒక స్థాయిని మించి ఉండడంతో అవి నానికి అంతగా నప్పలేదు అనే చెప్పాలి.
ముఖ్యంగా ఈ చిత్రంలో పెంచల్ దాస్ రాసి పాడిన దారి చూడు దుమ్ము చూడు పాట అందరిని అలరిస్తున్నది. ఈ చిత్రం పైన అంచనాలు పెరగడానికి ఈ పాట కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే బలహీనమైన కథ ఈ చిత్రానికి పెద్ద మైనస్. దర్శకుడు గాంధీ ఈ వైపుగా మరింత దృష్టి పెట్టాల్సింది.
ఏదేమైనా ఈ చిత్రం టాక్ పరంగా అయితే ఒక యావరేజ్ చిత్రాల జాబీతాలో చేరింది. అయితే కలెక్షన్స్ బట్టిగాని దీనిని ఏ జాబితాలో చేరుతుందో చెప్పగలం.