'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన బ్యూటీ మెహరీన్ కౌర్. బాలవుడ్లో 'ఫిలౌరీ' సినిమాలో నటించింది. ఈ సినిమాకి అనుష్కా శర్మ నిర్మాత. తాజాగా జరిగిన అనుష్కా శర్మ, విరాట్ కోహ్లీ మ్యారేజ్ రిసెప్షన్ ఫంక్షన్లో ఈ ముద్దుగుమ్మ ఇలా తళుక్కున మెరిసింది. పింక్ డ్రస్సులో ఓ పక్క ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే, మరో పక్క గ్లామర్ కూడా ఉట్టిపడేలా ఉంది మెహరీన్. ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని పలకించింది. తన గ్లామర్‌తో కుర్రకారుకు చక్కిలిగింతలు పెట్టిందీ బ్యూటీ. సినిమాల్లో కొంచెం బొద్దుగా కనిపించినా, తాజా ఫోటోలో స్లిమ్‌గా కనిపిస్తోంది. అంటే మెహరీన్ ఫిజిక్ విషయంలో కాన్సన్ట్రేషన్ బాగానే చేసినట్లుంది. బరువు తగ్గి, స్లిమ్‌గా అందంగా ముస్తాబైంది. స్లిమ్ సొగసులతో కుర్రకారును మరింత కవ్విస్తోంది ముద్దుగుమ్మ మెహరీన్.