బన్నీ కాదు, విక్రమ్‌కి నాని ఫిక్సయ్యాడట.!

మరిన్ని వార్తలు

ఏడాదికి రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటూ, చేసిన ప్రతీ సినిమాతోనూ హిట్‌ కొట్టి ఈ మధ్య నేచురల్‌ స్టార్‌ నాని ఓ మోస్తరు స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. అయితే ఒక్క సినిమా ఫెయిల్యూర్‌ టోటల్‌ ఈక్వేషన్స్‌ని ఛేంజ్‌ చేసేస్తోంది. అలాగే నాని కెరీర్‌ కూడా స్లో అయిపోయింది. ఎప్పుడయితే 'కృష్ణార్జున యుద్ధం' ఫ్లాప్‌ అని తేలిందో అక్కడి నుండి నానికి మళ్లీ బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయ్యింది. 'దేవదాస్‌' చిత్రం ఫర్వాలేదనిపించినా, గత చిత్రాల హిట్స్‌తో పోల్చితే ఇది కూడా చెప్పుకోదగ్గ హిట్‌ కాదు.

అయితే త్వరలో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని 'జెర్సీ' చిత్రంతో రాబోతున్నాడు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. కాగా తాజాగా నాని ఓ కొత్త ప్రాజెక్టుపై సైన్‌ చేశాడనీ తెలుస్తోంది. 'ఇష్క్‌', 'మనం' తదితర చిత్రాలతో హిట్స్‌ కొట్టిన విక్రమ్‌ కుమార్‌ నాని కోసం ఓ అదిరిపోయే సబ్జెక్ట్‌ ప్రిపేర్‌ చేశాడట. నాని బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఈ స్క్రిప్టు రూపొందించాడట విక్రమ్‌ కుమార్‌. వాస్తవానికి అల్లు అర్జున్‌తో విక్రమ్‌కుమార్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్‌ నుండి ఏ క్లారిటీ రాకపోవడంతో విక్రమ్‌, నానికి ఫిక్సయ్యాడట.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయట. ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుందనీ ప్రచారం జరుగుతోంది. 'మహానటి' తర్వాత కీర్తి సురేష్‌ తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసింది లేదు. గతంలో నానితో 'నేను లోకల్‌'తో కీర్తి సురేష్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS