రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమా ఏకంగా 1700 కోట్ల క్లబ్‌లోకి చేరింది అన్ని భాషల్లో కలిపి. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ 'దంగల్' సినిమా అన్ని భాషల్లో కలిపి 1500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తమిళ సినిమాకు ఇప్పటిదాకా ఆ ఘనత లేదు. అందుకే అభిమానులంతా ఒక్కటవుదాం. '2.0'ని తొలుత 500కోట్ల క్లబ్‌లోకి, తర్వాత 1000 కోట్ల క్లబ్‌లోకి చేర్చేద్దాం అనే కసి ప్రదర్శించారు. ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందుకే ఎక్కడా నెగిటివ్ రివ్యూస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
నెగిటివ్ ట్వీట్స్ కూడా చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సూపర్ హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఫస్ట్ డే 300 కోట్లు పైనే వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారట. ఇది సాధ్యమేనా.? అనే విషయం పక్కన పెడితే, రజనీకాంత్ అభిమానుల ఊపు ఆ రేంజ్‌లో ఉంది. శంకర్ సృష్టించిన విజువల్ అద్భుతం ఈ 'రోబో 2.0'. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'రోబో'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. అప్పట్లో 'రోబో' సృష్టించిన రికార్డుల్ని మళ్లీ '2.0' తిరగరాయనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ యాక్టింగ్, అప్పియరెన్స్, గెటప్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కానున్నాయి. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటించింది. సూపర్‌స్టార్ కెరీర్‌లో గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. వాటిన్నింటినీ '2.0' బీట్ చేసేయడం ఖాయమంటున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'రోబో 2.0' ఫైనల్ రిజల్ట్ ఏంటనేది సాయంత్రానికల్లా తెలిసిపోతుంది.