'గ్యాంగ్‌లీడర్' ప్రమోషన్స్‌లో భాగంగా నాని, బిగ్‌బాస్ షోకి గెస్ట్‌గా విచ్చేశాడు. కాసేపు నాని స్టేజ్‌పై సందడి చేశాడు. నాని ఎంట్రీతో బిగ్‌బాస్‌కి విపరీతమైన జోష్ వచ్చినట్లైంది. 'నా, నీ టీవీలోకి వెళ్లిపోదామా..' అంటూ నాని అనడం వీక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. తన చిలిపితనంతో, చలాకీతనంతో నాని హౌస్‌మేట్స్‌తో సహా, వీక్షకులకు కూడా నాని ఫుల్ ఫన్ పంచాడు. కంటెస్టెంట్స్‌కి 'గ్యాంగ్‌లీడర్' ట్రైలర్ చూపించాడు.
సినిమాలోని తన పెన్ నేమ్ 'పెన్సిల్' అని చెప్పి, హౌస్‌మేట్స్‌లో నవ్వులు పూయించాడు. సినిమాలో నాని రివేంజ్ డ్రామా రైటర్ కాబట్టి, తన స్టోరీస్‌లో హౌస్‌మేట్స్‌కి ఏ ఏ క్యారెక్టర్స్ సూటవుతాయో, వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఎంపిక చేశాడు. అలాగే నాగార్జున అడిగిన కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్‌ని తెలుగులో అనువదించి కాసేపు ఫన్ క్రియేట్ చేశాడు. చివరిగా నాగార్జున చేతిపై ఉన్న టాటూ గురించి అడిగాడు నాని. ఆ టాటూని చూపించమని కోరాడు. నాగార్జున 60 వ బర్త్‌డే స్పెషల్‌గా ఆ టాటూ వేయించుకున్నాననీ, ఆ టాటూ ప్రత్యేకతల్ని వివరించాడు.
ఇలా గెస్ట్‌గా వచ్చిన నాని, కాసేపే స్టేజ్‌పై ఉన్నప్పటికీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇంకాస్సేపు నాని ఉంటే బాగుండునని బిగ్‌బాస్ ప్రేమికులు ఆశ పడ్డారు. ఆ రేంజ్లో నాని ఎంటర్టైన్ చేశాడు. ఇక సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుని, 51వ రోజులోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్ హౌస్‌లో సరికొత్తగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలిక.