కొత్త కథల్నీ, కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో నేచురల్ స్టార్ నాని ముందుంటాడు. కథ నచ్చడంతోనే తానే నిర్మాతగా మారి 'అ' సినిమాని రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత రాజశేఖర్ వంటి సీనియర్ స్టార్‌తో 'కల్కి' రూపొందించాడు. తమన్నాతో 'దటీజ్ మహాలక్ష్మి' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడు నాని దృష్టిలో పడ్డాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన శ్రీకాంత్, నానికి ఓ కథ వినిపించాడు. ఆ కథ నానికి చాలా బాగా నచ్చిందట. కానీ, ఇప్పుడు నాని చేతిలో రెండు సినిమాలున్నాయి.
ఇంద్రగంటి మోహన్ కృష్ణతో 'వి' చిత్రంలో నటిస్తున్నాడు నాని. తర్వాత శివ నిర్వాణ దర్శత్వంలో ఓ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ రెండూ పూర్తి చేశాకే, కొత్త కథని పట్టాలెక్కించగలడు నాని. అయితే, 'వి' దాదాపు చివరి దశకు చేరుకుంది. సో త్వరలోనే శివ నిర్వాణ సినిమా పట్టాలెక్కుతుంది. ఏడాదిలో రెండు, మూడు సినిమాలు చేయగల సత్తా ఉంది నానికి. సో వచ్చే ఏడాదే ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఈ ఏడాది 'జెర్సీ', 'గ్యాంగ్‌లీడర్' సినిమాలతో హిట్ కొట్టిన నాని, వచ్చే ఏడాది కోసం ఆల్రెడీ మూడు సినిమాలు లైన్‌లో పెట్టేశాడన్న మాట.