న్యాచురల్ స్టార్ నాని కెరీర్ పీక్ లో ఉంది అని చెప్పాలి. వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు.
ప్రస్తుతం ఆయన చేసిన నిన్ను కోరి చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆ తరువాత దిల్ రాజు నిర్మాణ సంస్థలో MCA చిత్రం చేయనున్నాడు. ఇక దీని తరువాత, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడానికి నాని పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.
ఈ సినిమా ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి న్యాచురల్ స్టార్ నాని చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నాడు.