నాని సరసన క్రేజీ హీరోయిన్స్‌.?

మరిన్ని వార్తలు

ప్రస్తుతం రష్మిక పేరు టాలీవుడ్‌లో మారు మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈమె చేయి పడితే ఆ సినిమా సూపర్‌ హిట్టే అనే టాక్‌ కూడా బయటికి వచ్చేసింది. సో టాలీవుడ్‌ బంగారు బాతుగుడ్డులా రష్మిక మారిపోయింది. ఇక సాయి పల్లవి.. సెలెక్టివ్‌గా సినిమాలు చేసినా, చేసిన ప్రతీ సినిమా హిట్టే. ఒకవేళ హిట్‌ కాకున్నా, సాయి పల్లవి మ్యాజిక్‌ ఆ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు నానితో జత కట్టేందుకు సిద్ధపడుతున్నారట. ఇంతకీ ఏ సినిమా కోసం అంటారా.? ‘ట్యాక్సీవాలా’ డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యన్‌తో నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

కథానుగుణంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి చోటుందట. సో ఆ ఇద్దరి కోసం సాయి పల్లవి, రష్మిక పేర్లు పరిశీలిస్తున్నారట. గతంలో రష్మిక, ‘దేవదాస్‌’ సినిమా కోసం నానితో జత కట్టింది. సాయి పల్లవితో నాని ‘ఎంసీఏ’ సినిమాలో నటించాడు. సో నానితో ఈ ఇద్దరి స్క్రీన్‌ ప్రజెన్స్‌కీ పోజిటివ్‌ రెస్పాన్సే ఉండడంతో, వీరిద్దరినీ ఈ సినిమాకి ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అను విచిత్రమైన టైటిల్‌తో సమ్‌థింగ్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన నాని, హీరోయిన్స్‌ కాంబినేషన్స్‌తోనూ క్యూరియాసిటీ పెంచేశాడు. అయితే, ఈ న్యూస్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

ప్రస్తుతం నాని ` శివ నిర్వాణ కాంబోలో ‘టక్‌ జగదీష్‌’ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. మరోవైపు, సాయి పల్లవి ‘విరాట పర్వం’, ‘లవ్‌ స్టోరీ’ సినిమాలతో బిజీగా ఉండగా, రష్మిక, బన్నీ - సుకుమార్‌ సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS