నాని-సాయి పల్లవి జంటగా రూపొందుతున్న చిత్రం MCA తాలుకా రిలీజ్ డేట్ ని ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో అనగా డిసెంబర్ 21వ తేదిన ఈ చిత్రం విడుదలకి ముహూర్తం ఫిక్స్ చేసేశారు.
ఈ MCA చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసేసిన సాయి పల్లవి చేస్తున్న రెండవ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
ఇక హీరో నాని విషయానికి వస్తే, వరుస హిట్స్ తో స్టార్ డం అందుకున్న హీరోల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. ఈ MCA చిత్రంతో వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.