సరిపోదా శనివారం మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: సరిపోదా శనివారం 
దర్శకత్వం:  వివేక్ ఆత్రేయ 
కథ - రచన :  వివేక్ ఆత్రేయ 


నటీనటులు:  నాని , ప్రియాంక అరుళ్ మోహన్ , SJ సూర్య,  అభిరామి          


నిర్మాతలు: D. V.V. దానయ్య  
సంగీతం:  జాక్స్ బిజోయ్ 
సినిమాటోగ్రఫీ : మురళి G  
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్  


బ్యానర్:  DVV ఎంటర్టైన్ మెంట్  
విడుదల తేదీ: 29 ఆగస్ట్ 2024  
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


వరస హిట్లతో దూసుకుపోతున్న నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' . టైటిల్ తోనే అందరిలో ఆసక్తి పెంచారు మేకర్స్. అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టారు అన్న చర్చతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. వివేకా ఆత్రేయ దర్శకుడిగా ఈ మూవీని తెరెకెక్కించారు. నాని వివేక్ కాంబో రెండో సారి. మొదట వీరిద్దరూ కలిసి 'అంటే సుందరానికీ' వర్క్ చేశారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా చాలా మంది ఫెవరెట్ సినిమా అని చెప్పొచ్చు. నాని దసరా, హాయ్ నాన్న సినిమాల సక్సెస్ తో మంచి పాజిటీవ్ గా ఈ మూవీ చేసాడు. ప్రమోషన్స్ కూడా హైరేంజ్ లో చేసాడు. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజైన ఈ  పాన్ ఇండియా మూవీ ఎలా ఉందో? నానికి హ్యాట్రిక్ ఇచ్చిందో లేదో చూద్దాం.  


కథ:
చిన్ను అలియాస్ సూర్య (నాని)కి విపరీతమైన కోపం. చిన్ను కోపాన్ని కంట్రోల్ చేయటానికి  తల్లి ఛాయా దేవీ (అభిరామి) ఓ కండీషన్ పెడుతుంది. వారమంతా కామ్ గా ఉండి ఏదో ఒక రోజు కోపాన్ని చూపించమని చెబుతుంది. అసలు కోపం అంటే ఏంటో చెప్పాలని కొడుక్కి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతలోనే ఛాయా దేవి  చనిపోతుంది. అప్పటి నుంచి శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య డిసైడ్ అవుతాడు. అందుకనే మిగతా రోజులు ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ల పేర్లు ఓ బుక్ లో రాసి పెట్టుకుంటాడు. శనివారం కూడా ఆ కోపం తగ్గకపోతే వాళ్లని కొడుతుంటాడు. సోకులపాలెం అనే ఊరిలో ఎస్సై దయానంద్ (ఎస్ జే సూర్య) తన ప్రతాపాన్ని, అధికారాన్ని చూపిస్తుంటాడు. నిత్యం  కోపంతో ఊగిపోతూ, ఎవరో ఒకరిని హింసించటమే పనిగా పెట్టుకుంటాడు. దయానంద్‌కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ (మురళీ శర్మ)తో భూ వివాదాలుంటాయి. ఈ క్రమంలోనే  దయానంద్ అన్నని చంపాలని ప్లాన్ చేస్తాడు. అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది చారులత (ప్రియాంక మోహన్). ఆమె సూర్యని సోకులు పాలెం తీసుకు వస్తుంది. అసలు చారులత సూర్యని ఎందుకు సోకుల పాలెం తీసుకు వస్తుంది. ఆమె ఉద్దేశ్యమేంటి? సూర్య అక్కడేం చేస్తాడు. దయానంద్, సూర్యల మధ్య వివాద మేంటి? చివరికి ఏం జరిగింది అన్నది థియేటర్లో చూడాల్సిందే.   


విశ్లేషణ: 
'సరిపోదా శనివారం' రొటీన్ కథ. హీరో కేవలం శనివారం మాత్రమే కోపం ప్రదర్శిస్తాడు.ఇదొక్కటే కొత్త పాయింట్ తప్ప , ఇంకేం కొత్త దనం కనిపించలేదు. టీమ్ ముందే కాన్సెప్ట్  చెప్పటంతో హీరో క్యారక్టర్ పై ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. ఆడియన్స్ కూడా కథ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాన్సెప్ట్ కుదిరితే, సీన్స్ అద్భుతంగా వస్తాయి అని చెప్పటానికి  'సరిపోదా శనివారం' చాలు. వివేక్ ఆత్రేయ తీసుకున్న కాన్సెప్ట్‌ ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బావుంది. ఆడియన్స్ కి పెద్దగా డౌట్స్ క్రియేట్ చేయకండా సాఫీగా కథ ముందుకు నడిపారు. స్ట్రెయిట్ నేరేషన్ వలన ప్రేక్షకుడి మెదడుకి పెద్దగా పని లేదు. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ బాగానే మెప్పించాయి. కాకపొతే కొంచెం నిడివి తగ్గిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్  నిడివి ఎక్కువ ఉన్నా కామెడీ వలన, కాన్సెప్ట్ వల్ల పెద్దగా తెలియలేదు. ఇంటర్వెల్ తర్వాత  కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంది. దర్శకుడి కన్నా క్రెడిట్ నాని, సూర్యలకి దక్కుతుంది. వారి నటనతో ఆ పాత్రలకి హైపు తీసుకొచ్చారు. యాక్షన్ సీన్స్ కి జేక్స్ బిజాయ్ ఇచ్చిన నేపథ్య సంగీతం సూపరని చెప్పాలి. 


ఫస్ట్ హాఫ్ లో హీరో బాల్యం, తల్లి చెప్పే విషయాలు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, హీరోయిన్ ఎంట్రీ,  విలన్ ఇంటర్ డక్షన్ లని చూపించగా, సెకండ్ హాఫ్ లో హీరో క్యారక్టర్ ని బయట పెట్టి, హీరో, విలన్ ,మధ ఫైటింగ్ సీన్స్ పెట్టారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కొత్తగా, ప్రేక్షకుడి ఊహకి అందని విధంగా లేవు. రొటీన్ గా సాగాయి. ముఖ్యంగా నాని, ఎస్ జే సూర్యల సీన్లు, వారిద్దరి ఫేస్ ఆఫ్, నటన స్పెషల్‌గా ఉంది. ఈ మూవీకి ఇద్దరు హీరోలు నాని, సూర్యలు. ఒక్కో చోట నాని కంటే కూడా SJ  సూర్య హైలెట్ అయిన సీన్స్ ఎక్కువ ఉన్నాయి.   


నటీ నటులు:
నాని ఎలాంటి పాత్ర చేసినా పరకాయ ప్రవేశం చేస్తాడన్న సంగతి తెలిసిందే. నాని నటన గూర్చి వంక పెట్టడానికి లేదు. ఈ మూవీకి అసలు సిసలైన హీరో ఎవరంటే నాని. కొని సీన్స్ లో పాత నాని కనిపించినా , కోపం ప్రదర్శించేటప్పుడు - యాక్షన్ సీన్స్ లో మాత్రం సూర్య కనిపించాడు. చారులతగా ప్రియాంక మోహన్ నటన పరవాలేదనిపించింది. ఇంతక ముందు నాని గ్యాంగ్ లీడర్ లో అలరించిన ఈ జంట ఇప్పుడు మరొకసారి కలిసి నటించారు. నాని , ప్రియాంక జోడికి మంచి మార్కులుపడతాయి. అందంగా, ఇన్నోసెంట్ గా కనిపించి ఆకట్టుకుంది ప్రియాంక. దయా గా నటించిన ఎస్జే సూర్య నటన అద్భుతంగా ఉంది. తెలుగు తెరకి  మరో గొప్ప విలన్ దొరికాడు. విలన్ పాత్రల్లో ఆకట్టుకునే నటన చూపించే సూర్య ఈ మూవీలో అవుట్ స్టాడింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఎక్కడ వంక పెట్టడానికి లేకుండా నటించాడు. మంచి దర్శకుడి తో పాటు, గొప్ప యాక్టర్ ఉన్నాడని మరో సారి నిరూపించుకున్నాడు సూర్య. ఏ మాత్రం దయ లేని దయా పాత్రతో ప్రతి ఆడియన్ తిట్టుకుంటూనే ప్రేమలో పడతాడు. విలన్ గా అతని మ్యానరిజం కూడా బాగుంది. దయా పాత్రకి ఎస్.జె. సూర్య పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. హీరోకి సమానముగా పేరు తెచ్చి పెట్టే నటన కనపరిచాడు సూర్య. ఒక వైపు విలనిజం, మరో వైపు డైలాగ్ డెలివరీతో కామెడీ పండించాడు. చాలా రోజుల తరవాత సాయి కుమార్‌ మంచి క్యారక్టర్ లో కనిపించారు. తండ్రి పాత్రలో నటనతో ఆకటుకున్నాడు. మురళీ శర్మ పాత్ర కూడా కొత్తగా ఉంది. నాని తల్లి పాత్రలో అభిరామి, అక్క కారెక్టర్‌లో అదితీ పాత్రలు మెప్పించాయి.  శుభలేఖ సుధాకర్, అలీ, సత్య ప్రకాష్ ఇలా అన్ని పాత్రలు వారి పరిధి మేరకు నటించారు.  


టెక్నికల్ :
సినిమా టెక్నికల్ విషయాలకి వస్తే దర్శకుడు ఫైయిల్యూర్ అని చెప్పాలి. కేవలం నాని , SJ  సూర్య లాంటి వాళ్ళని పెట్టి కథ నడిపించాలని, థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించాలని తాపత్రయ పడ్డాడు తప్ప కథపై ద్రుష్టి పెట్టలేదు. రొటీన్ కథ, రొటీన్ క్లైమాక్స్. సాగదీత. కథ ఉంటే నిడివి ఎక్కువున్న ప్రేక్షకులు భరిస్తారు కానీ, కథ లేకుండా ఊరికినే మూడు గంటలు కూర్చొని సినిమా చూడటం అంటే సహనానికి పరీక్షే. ముఖ్యంగా సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ గూర్చి చెప్పుకోవాలి. నేపథ్య సంగీతం బాగుంది. పాటల కంటే ఆర్ఆర్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపింది. కొన్ని మళయాళ సినిమాల RR  గుర్తుకు వస్తుంది. మురళీ జి సినిమాటోగ్రఫీ 'సరిపోదా శనివారం'కు కొత్త రంగు అద్దింది. మాములు సీన్స్ ని కూడా లైటింగ్ తో హైలెట్ చేసారు. యాక్షన్ సీన్స్ మూడ్ క్రియేట్ చేసేలా లైటింగ్ అమర్చారు. మురళి ఫాలో అయిన కలర్ థీమ్ ప్యాట్రన్ బావుంది. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాణ విలువలు బావున్నాయి. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా  ఉంది. హైద్రాబాద్ లో సోకులు పాలెం సెట్ వేసి సముద్రాన్ని చూపించటమే కొంచెం లాజిక్ మిస్ అయ్యింది.   

 

ప్లస్ పాయింట్స్ 

నాని 
విలన్  (SJ  సూర్య)  
కెమరా వర్క్ 
బ్యాక్గ్రౌండ్ స్కోర్ 


మైనస్ పాయింట్స్

రన్ టైమ్
లాజిక్ లేని సీన్స్ 
పాటలు  


ఫైనల్ వర్దిక్ట్: పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ సరిపోదా శనివారం

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS