వరుస విజయాలతో దూసుకుపోతూ స్టార్ట్ రేంజ్ కి ఎదిగిన నాని, తనకి ఇంతటి కీర్తిని ఇచ్చిన అభిమానుల కోసం పండగపూట ఒక బహుమతి ఇవ్వన్నున్నాడు. అది కూడా పండగ మూడు రోజుల పాటు కావడం విశేషం.
అదేంటంటే- నాని ద్విపాత్రభినయం చేస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం చిత్రానికి సంబందించిన కృష్ణ, అర్జున లుక్స్ తో పాటుగా ఆ సినిమా నుండి ఒక పాటని కూడా అభిమానుల కోసం విడుదల చేయనున్నారట. దీనిలో భాగంగానే రేపు కృష్ణ లుక్, ఎల్లుండి అర్జున లుక్ ఆ తరువాత రోజు కృష్ణార్జున యుద్ధం సినిమా నుండి మొదటి పాటని విడుదల చేస్తారు.
ఈ కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా తమిళ సంగీత దర్శకుడు హిప్ హప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరం వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
మొత్తానికి నాని ఈ పండగకి తన అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చేశాడు.