తెలుగు టీవీ రంగంలో ఒక సంచలనం సృష్టించిన ప్రోగ్రాం బిగ్ బాస్ తెలుగు. మొదటి సీజన్ లోనే ఈ షోకి చాలా పెద్ద ఎత్తున TRPలు రాబట్టగలిగింది. ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యానం కూడా ఈ ప్రోగ్రాం కి చాలా పెద్ద ఆదరణ తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు.
ఈ సమయంలోనే రెండవ సీజన్ వచ్చేసింది. అయితే కారణాలు ఏంటో తెలియదు కాని, ఎన్టీఆర్ స్థానంలో మరో హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించి అనధికార ప్రకటనలు ఎప్పటినుండో వస్తున్నా సరే కొద్ది క్షణాల ముందు స్టార్ మా అధికారికంగా నానితో కూడిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 పోస్టర్ ఒకటి విడుదల చేశారు.
ఇక నాని కూడా అందరికి- బాబాయ్.. ఈ సారి ఇంకొంచెం మసాలా... అంటూ ట్వీట్ చేయడంతో అందరికి ఈ సీజన్ మొదటి దానితో పోల్చితే ఇంకా పెద్దగా ఉండబోతుంది అన్న హింట్ ఇచ్చేశారు అని చెప్పాలి.
ఏదేమైనా.. ఈ సీజన్ 100 రోజుల పాటు జరగనుంది.. ప్రేక్షకులు మరి మీరు రెడీనా రెండవ సీజన్ కి...