గుమ్మడి వరలక్ష్మీ .. షార్ట్ కట్ లో గుమ. ఇదీ నాని కొత్త ప్రేమ కధలో హీరోయిన్ పేరు. నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టక్ జగదీశ్'. 'నిన్ను కోరి', మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకోసారి అనే పల్లవితో సాగిన ఈ పాట మెలోడిని ఇష్టపడే వారిని ఆకట్టుకునేలా వుంది.
''ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా యదలో చేరి..మళ్లొసారి, మళ్లొ సారి పిలవాలంది నీవు ప్రతిసారి'' అనే పల్లవి చాలా క్యాచీగా వుంది. శ్రేయా గోషాల్ వాయిస్ పాటకు ఆదనపు ఆకర్షణ. మద్యలో కాలభైరవ పాడిన లైన్స్ కూడా ట్రెండీగా వున్నాయి. తమన్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో వున్నాడు. ఎలాంటి ట్యూన్ చేసిన క్యాచిగా కుదురుతుంది. ఈ పాట కూడా వింటే ఇంకోసారి వినేపాటగానే వుంది. రేపు ప్రేమికుల రోజు. మొత్తానికి ఒక రోజు ముందే ఫ్యాన్స్ కి లవ్లీ మ్యూజికల్ గిఫ్ట్ ఇచ్చేశాడు నాని.