నాని ఇక్కడే కాదు అక్కడ కూడా.!

మరిన్ని వార్తలు

నేచురల్‌స్టార్‌ నాని ఇప్పుడే కాదు, ఎప్పుడూ బిజీనే. తెలుగులోనే కాదు, తమిళంలోనూ బిజీనే. తెలుగుతో పాటు నాని తమిళ తంబీలకు పరిచయస్తుడే. 'వెప్పం' తదితర తమిళ చిత్రాల్లో నాని నటించాడు. నాని నటించిన 'ఈగ' మొదలైన చిత్రాలు తమిళంలోనూ విడుదలయ్యాయి.

 

ప్రస్తుతం తెలుగులో నాని వరుస హిట్లతో దూకుడు మీదున్నాడు. లేటెస్టుగా విడుదలైన 'కృష్ణార్జున యుద్ధం' సినిమా నానిని కొంచెం నిరాశ పరిచినా, త్వరలోనే నాగ్‌తో మల్టీ స్టారర్‌తో రానున్నాడు నాని. 'కృష్ణార్జున యుద్ధం' రిజల్ట్‌ నానికి పెద్దగా నష్టం కలిగించే అంశమేమీ కాదనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నాని నటిస్తున్న చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. 

'వేలన్‌ ఎట్టుతిక్కుమ్‌' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన అమలాపాల్‌ నటిస్తోంది. నటుడు కమ్‌ దర్శకుడు అయిన సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకత్వంతో పాటు, ఆయన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాలో. సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ కాన్సెప్ట్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నాని, ఈ సినిమాతో తమిళ తంబీలకు ఓ మెసేజ్‌నివ్వబోతున్నాడు. 

ప్రస్తుతం సమాజంలో పాతుకుపోయిన అవినీతి, లంచగొండితనంపై పోరాడే ఓ యువకుడి పాత్రలో నాని కనిపించబోతున్నాడు. సందేశంతో పాటు, పవర్‌ఫుల్‌ యాక్షన్‌నీ మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్‌. మరోవైపు నాని అతి త్వరలో బుల్లితెరపై బిగ్‌బాస్‌గా మెరవనున్నాడు. 'బిగ్‌బాస్‌' సీజన్‌ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మెగా గేమ్‌షో బుల్లితెరపై ప్రసారం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS