డైరెక్టర్‌ తేజ వేసిన స్కెచ్ మామూలుగా లేదు..!

By iQlikMovies - May 23, 2018 - 18:43 PM IST

మరిన్ని వార్తలు

కొత్త నటీనటులతో సినిమాలు తెరకెక్కించి సూపర్‌ డూపర్‌ హిట్స్‌ కొట్టేశాడు గతంలో తేజ. అయితే మూస కథలనే నమ్ముకుంటూ బోర్‌ కొట్టించేస్తున్నాడంటూ కొన్నాళ్లు తేజని పక్కన పెట్టేశారు ఆడియన్స్‌. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన తేజ సూపర్‌ హిట్‌ కొట్టి, బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. 

ఆ తర్వాత తేజ కోసం స్టార్‌ హీరోలు క్యూ కట్టారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత రానాతోనే మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు తేజ. అదే తరుణంలో రానా బాబాయ్‌ వెంకటేష్‌తోనూ ఓ ప్రాజెక్ట్‌కి కమిట్‌ అయ్యాడు. 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు ఆ సినిమాకి. ఇంతలోనే ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం బాలయ్య తేజని లాక్‌ చేయడంతో, ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు కదా అని అటు వైపు మళ్లాడు కానీ, తేజ ఆ ప్రాజెక్ట్‌ని డీల్‌ చేయడం తన వల్ల కాదని వెనుదిరిగాడు. 

ఇలా ఒక్కటేమిటి తేజ అన్నింట్లోనూ వేలు పెడుతూ, చివరికి ఏ ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ చేయలేకపోతున్నాడు. మరో వైపు రకరకాల గాసిప్స్‌ తేజ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్యనే వెంకీతో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్‌నే తేజ పట్టాలెక్కించేశాడనీ వార్తలు వచ్చాయి. అసలింతకీ తేజ చేతిలో ఒక్క సినిమా అయినా ఉందా? లేదా? ఒక సినిమాని పట్టుకుని ఆ సినిమా పూర్తయ్యేదాకా అస్సలు దిక్కులు చూడని తేజ ఇప్పుడెందుకిలా చేస్తున్నాడు. 

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తర్వాత వరుస పెట్టి స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తాడని భావించారంతా. కానీ వస్తున్న మంచి అవకాశాల్ని తేజ నిర్లక్ష్యం చేస్తున్నాడెందుకో. 'గురు' సినిమా తర్వాత వెంకీ ఖాళీగా ఉన్నాడు. వెంకీతో తేజ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కినా ఈ పాటికి ఓ కొలిక్కి వచ్చేది. అదీ జరగలేదు. ఏది ఏమైనా తేజ ఏదో పెద్ద స్కెచ్చే వేశాడనిపిస్తోంది. తాజాగా మెగా కాంపౌండ్‌ హీరోకి తేజ గాలమేసినట్లు గాసిప్‌ వినిపిస్తోంది. చూడాలి మరి తేజ ఈ సారి ఏం చేయబోతున్నాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS