నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదివరకటిలా ది¸యేటర్లలో హంగామా లేదు. ఇంట్లోనే.. ‘వి’ సినిమాని అందరూ తిలకించాల్సి వచ్చింది. నిజానికి, ఇది తప్పనిసరి పరిస్థితి. ఆ సంగతి పక్కన పెడితే, ‘వి’ సినిమా తనకు నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిందని చెబుతున్నాడు. ‘ఏ కథ విన్నప్పుడైనా ఎగ్జయిట్‌మెంట్ కలిగితేనే ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటాను. అలా ఈ సినిమాతోనూ నాకు చాలా చాలా ఎగ్జయిట్‌మెంట్ కలిగింది. నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర గతంలోనూ చేసినా, ఇది చాలా భిన్నమైనది.. నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది’ అని చెప్పాడు నాని.
‘వి’ సినిమాతో మిక్స్‌డ్ రిజల్ట్ వచ్చింది కదా.? ఇలాంటి రిస్క్ అవసరమా.? అన్న ప్రశ్న నానికి విరివిగా ఎదురవుతోంది. కానీ, రిస్క్ చేయడమంటే తనకు చాలా ఇష్టమని నాని అంటున్నాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలతో వచ్చే కిక్కుతో పోల్చితే, ఈ తరహా సినిమాలతో వచ్చే కిక్కు చాలా బావుంటుందని నాని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే, ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని కోసం మరో ఇంట్రెస్టింగ్ ద్రి¸ల్లర్‌ని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే నాని ఫోకస్ తన తదుపరి సినిమా ‘టక్ జగదీష్’ మీదకు వెళ్ళింది. దాంతోపాటుగా, ‘శ్యామ్ సింగారాయ్’ అనే ప్రయోగాత్మక సినిమాలోనూ నాని నటిస్తోన్న విషయం విదితమే.