వెంకీ సినిమాలో... స‌మంత‌, రానా?

By Gowthami - March 04, 2021 - 13:46 PM IST

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం `దృశ్య‌మ్‌`ని రీమేక్ చేసి, త‌న ఖాతాలో ఓ హిట్ వేసుకున్నాడు వెంక‌టేష్‌. ఇప్పుడు `దృశ్య‌మ్ 2` కూడా వ‌చ్చింది. అది ఇంకా పెద్ద హిట్‌. దాంతో మ‌రో ఆలోచ‌న లేకుండా `దృశ్య‌మ్ 2`ని తెలుగులో రీమేక్ చేసేస్తున్నాడు వెంకీ. ఇటీవ‌లే ఆ సినిమా ప‌ట్టాలెక్కింది కూడా. అయితే ఈసారి దృశ్య‌మ్ లో స్టార్ హంగామా ఎక్కువ‌గానే క‌నిపించ‌బోతోంది. ఈ సినిమాలో రానా, స‌మంత‌లు కూడా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం మొద‌లైంది. వీళ్ల‌వి కీల‌క‌మైన పాత్ర‌లు కావ‌ట‌. కేవ‌లం గెస్ట్ రోల్స్ అని తెలుస్తోంది.

 

`దృశ్య‌మ్ 2` మాతృక‌లో ఇలాంటి గెస్ట్ రోల్స్ ఏమీ లేవు. మ‌రి వాటిని ఇక్క‌డే ఎందుకు చేర్చారో మ‌రి? మాతృక కంటే భిన్నంగా, కొత్త‌గా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని ఈ మార్పులు చేశారేమో..? మ‌రి రానా, స‌మంత‌ల‌వి ఎలాంటి పాత్ర‌లు? వాటి నిడివి ఎంత‌? అస‌లు ఈ సినిమాలో వీళ్లు ఉన్నారా, లేదా? ఈ వివ‌రాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. వెంక‌టేష్ న‌టించిన `నార‌ప్ప‌` మేలో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే `దృశ్య‌మ్ 2` కూడా ఈ యేడాదే విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS