తెలుగు సినిమాలకు ఈమధ్య బాలీవుడ్ లో మంచి గిరాకీ ఏర్పడుతోంది. మన దగ్గర మంచి హిట్టయిన సినిమాలనే కాదు, యావరేజ్‌గా ఆడిన కథల్నీ మంచి రేట్లతో కొనుక్కుంటున్నారు. తాజాగా మరో తెలుగు సినిమా బాలీవుడ్‌కి వెళ్లబోతోంది. అదే హిట్. నాని నిర్మాతగా తెరెకెక్కిన సినిమా ఇది. విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించారు.
థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాకి తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఓ టీ టీలోనూ వ్యూవర్ షిప్ బాగుంది. ఈ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ కి తీసుకెళ్తున్నారు. హీరో, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. అయితే దిల్ రాజుకి ఈ సినిమా నిర్మాణంలో వాటా ఉందని తెలుస్తోంది. ఎఫ్ 2ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు దిల్‌రాజు. ఇది తన రెండో ప్రాజెక్టు అవుతుంది.