నాని కథానాయకుడిగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ తెరకెక్కించాడు వివేక్ ఆత్రేయ. గత ఏడాది వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు విజయం అందుకోలేదు కానీ మంచి పేరు తెచ్చుకుంది. ఒక సున్నితమైన పాయింట్ ని చాలా స్టయిలీష్ గా అందంగా చెప్పారనే ప్రసంశలు వచ్చాయి.
అయితే ఇప్పుడు నాని, వివేక్ మరోసారి జతకడుతున్నారు. అవును వీరి కలయికలో మరో సినిమా రానుంది. దానయ్య ఈ సినిమాకి నిర్మాత. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తారు. ప్రస్తుతం నాని దసరా ప్రమోషన్స్ లో వున్నారు. మార్చి 30న దసరా విడుదలౌతుంది. దిని తర్వాత కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దిని తర్వాత వివేక్ సినిమా వుండే అవకాశం వుంది.