ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీ అయిపోయారు కానీ తారక్ మాత్రం ఇంకా విరామంలోనే వున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపారు. కానీ అది ఇంకా ముహూర్తం కూడా జరపుకోలేదు. అయితే ఇప్పుడీ తేదీ ఖరారైనట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఈనెల 24న కొబ్బరికాయ కొట్టనున్నారని సమాచారం.
ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది. ఆచార్య ఫ్లాఫ్ తర్వాత కాస్త విరామం తీసుకున్న కొరటాల ఎన్టీఆర్ మార్క్ ఎంటర్ టైనర్ ని సిద్దం చేశారు. ఎన్టీఆర్ శైలి మాస్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది.