నారా రోహిత్ హీరోగా 'బాలకృష్ణుడు' అనే సినిమా రూపొందుతోంది. పవన్ మల్లెల ఈ చిత్రానికి దర్శకుడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌ని నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఫొటో, మోషన్ పోస్టర్ రెండూ సూపర్బ్‌గా ఉన్నాయి. గత కొంతకాలంగా నారా రోహిత్ కాస్త బొద్దు శరీరంతో కన్పిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం స్టైల్ మార్చేశాడు. సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడు. ఈ మధ్యనే 'శమంతకమణి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నారా రోహిత్. ఆ సినిమా రోహిత్‌కి మంచి విజయాన్నే అందించింది. అయితే ఇది మల్టీ స్టారర్ మూవీ. రోహిత్‌తో పాటు ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబు నటించారు ఈ సినిమాలో. అయినా కానీ తనదైన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు నారా రోహిత్ ఈ సినిమాతో. తొలి సినిమా 'బాణం' నుంచి ఇప్పటిదాకా విలక్షణతతో కూడిన సినిమాల్ని ఎంచుకుంటున్న ఈ విలక్షణ నటుడు ఈ సారి బాలకృష్ణుడి పాత్రలో సూపర్బ్ అనిపిస్తున్నాడు. ఫిజిక్ విషయంలో నారా రోహిత్ పెద్దగా దృష్టి పెట్టడు. అయినా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతాడు. కానీ 'బాలకృష్ణుడు' సినిమాలో కొత్త రోహిత్ కనిపిస్తున్నాడు. 'బాలకృష్ణుడి'గా రోహిత్ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. రెజినా మరోసారి నారా రోహిత్‌తో ఈ సినిమాలో జతకడ్తోంది. 'శివగామి' రమ్యకృష్ణ ఈ 'బాలకృష్ణుడు' సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడం గమనించదగ్గ అంశం.