నారా రోహిత్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ

By iQlikMovies - January 10, 2017 - 13:18 PM IST

మరిన్ని వార్తలు

నారా రోహిత్‌ కొత్త సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు'. ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమాలో మెయిన్‌ హీరో శ్రీ విష్ణు. కానీ అంతా నారా రోహిత్‌ క్యారెక్టర్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు నారా రోహిత్‌ ఈ సినిమాలో. నారా రోహిత్‌ క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. కాస్త నెగిటివ్‌ టచ్‌ ఉన్న రోల్‌ ఇది. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న హీరో నారా రోహిత్‌. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ గురించి చెప్పాలంటే, ఇలాంటి క్యారెక్టర్‌ని ఒప్పుకోవాలంటేనే నిజంగా ధైర్యం కావాలి. అలాంటిది రోహిత్‌ ఒప్పుకున్నాడంటేనే తెలుస్తోంది సబ్జెక్ట్‌ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో. అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్‌ రోల్‌ చేయడమే కాకుండా, సినిమా నిర్మాణంలో కూడా భాగం పంచుకున్నాడు. కమర్షియల్‌గా హిట్స్‌ సాధించకపోయినా, రోహిత్‌ నుండి వచ్చే సినిమాల్లో చాలా వరకూ మంచి సినిమాలున్నాయి. ఆలోచించే సబ్జెక్ట్స్‌ని, డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ని ఎంచుకోవడంలో నారా రోహిత్‌ది ఓ డిఫరెంట్‌ స్టైల్‌. గతంలో 'జ్యో అచ్యుతానంద' సినిమా ఆ కోవలోకే వస్తుంది. అవసరాల శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు వచ్చిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఏడాది చివర్లో నారా రోహిత్‌కి సక్సెస్‌ దక్కింది ఈ సినిమాతో. అలాగే న్యూ ఇయర్‌లో మరిన్ని మంచి సినిమాలు నారా రోహిత్‌ నుండి రావాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS