తొలి చిత్రం నుండీ విలక్షణ కథలనే ఎంచుకుంటూ హీరోగా తనదైన ముద్ర వేయించుకున్నాడు నారా రోహిత్. కథనే కథానాయకుడుగా నమ్మే హీరో నారా రోహిత్. కథలో బలం ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి మనోడు సిద్ధమే. అలాంటిది తాజాగా నారా రోహిత్ నటిస్తున్న చిత్రం 'వీర భోగ వసంతరాయలు'. ఈ చిత్రంలో నారా రోహిత్‌తో పాటు, అతనికి అత్యంత ప్రాణ స్నేహితుడైన శ్రీవిష్ణు కూడా నటిస్తున్నాడు. అలాగే అందాల భామ శ్రియ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని చెప్పేందుకు వీలు లేదు. ఎందుకంటే నారా రోహిత్ ఒప్పుకున్నాడంటేనే అదో డిఫరెంట్ కాన్సెప్ట్ అనే అర్ధం చేసుకోవాలి. ఇకపోతే, లేటెస్టుగా ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో నారా రోహిత్ వికలాంగుడిగా నటిస్తున్నాడట. అతనికి కుడిచేయి ఉండదట. ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రిస్క్‌లు చేసేందుకు వెనకాడని నారా రోహిత్ మరీ ఇంత పెద్ద రిస్క్ చేసేస్తున్నాడా? అని ఆయన అభిమానులు అవాక్కవుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి శ్రియ ఫస్ట్‌లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. శ్రియ ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్ పాత్ర పోషిస్తోంది. తాజాగా విడుదలైన ఆ ఫస్ట్‌లుక్‌లో శ్రియ పాత్ర మరీ ఆశక్తిని కలిగిస్తోంది.
చూడాలి మరి నారా రోహిత్ క్యారెక్టర్ విషయమై స్ప్రెడ్ అవుతున్న ఈ గాసిప్‌లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాలి.