ఈ వారం బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయేదేవరు?

By iQlikMovies - July 21, 2018 - 15:18 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బోస్ తెలుగు 2వ సీజన్ ఆరు వారాలు రేపటితో పూర్తిచేసుకోనుంది. ఇక ఈ వారం ఇంటి నుండి ఎవరు బయటకి వెళ్ళనున్నారు అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

దీనికి ప్రధాన కారణం- ఈ వారం ఇంటి సభ్యులలో చాలా స్ట్రాంగ్ పార్టిసిపెంట్స్ గా భావిస్తున్న(తేజస్వి, తనీష్, రోల్ రైడా, సామ్రాట్, దీప్తి) డేంజర్ జోన్ లో ఉండడం. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వారిలో ఎవరు వెళ్ళిపోయినా అది ఒక షాక్ అనే అందరు అంచనాలు వేస్తున్నారు.

ప్రస్తుతానికైతే దీప్తి లేదా సామ్రాట్ లో ఒకరు వెళ్ళిపోతారు అన్న ఊహాగానాలు, అభిప్రాయాల నడుమ ఈ వారం ఎలిమినేషన్ జరగబోతున్నది. ఇప్పటికిప్పుడు అయితే వీరిరువురి పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఒకవేళ వీరు కాకుండా వేరే ఎవరైనా ఇంటి నుండి గనుక వెళ్ళిపోతే అది ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి.

ఏదేమైనా రేపటి ఎపిసోడ్ తో ఈ మొత్తం అంశంలో క్లారిటీ వచ్చేస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS