'ఆటగాళ్లు' వచ్చేస్తున్నారహో.!

మరిన్ని వార్తలు

నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆటగాళ్లు'. ఈ సినిమాని జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. కొత్త కొత్త కథలను పరిచయం చేయడానికి ముందూ వెనకా ఆలోచించకుండా రంగంలోకి దూకే అతి కొద్ది మంది హీరోల్లో నారా రోహిత్‌ ఒకరు. 'అప్పట్లో ఒకడుండేవాడు' తదితర చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు. ఎప్పుడూ చెప్పుకోదగ్గ స్టార్‌డమ్‌ ఆశించలేదు నారా రోహిత్‌.

తన పాత్ర కన్నా, కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కథనే మెయిన్‌ హీరోగా నమ్మే తత్వం ఉన్నోడు. అందుకే, కథ నచ్చితే, అందులో తన పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించకుండా ఓకే చేసేస్తాడు. హ్యాండ్‌సమ్‌ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరున్న జగపతిబాబు ఈ మధ్య విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనని తాను విభిన్నంగా ప్రజెంట్‌ చేసుకుంటున్నాడు. 'ఆటగాళ్లు' సినిమాలో నారా రోహిత్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్నాడు జగపతిబాబు.

'ఆటగాళ్లు' గేమ్‌ ఫర్‌ లైఫ్‌ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కథా, కథనాలు చాలా కొత్తగా ఉంటాయట. నారా రోహిత్‌, జగ్గూభాయ్‌ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చూసే ఆడియన్స్‌ని ఆశ్యర్యానికి గురి చేసేలా ఉంటాయట. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో ముద్దుగుమ్మ దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS