ట్రోల్స్ : పవిత్రని ఇలా ముగ్గులో దించావా నరేషా

మరిన్ని వార్తలు

నరేష్, పవిత్ర లోకేష్.. రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య తనని పెళ్లి చేసుకున్నాని ఓ రెండు వీడియోలు కూడా విడుదల చేశారు నరేష్. అయితే ఇది సినిమా పెళ్లి. ఈ ఇద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

 

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రోల్స్ కి దారి తీసింది. పవిత్ర లోకేష్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. నరేష్‌ ఆమెను తదేకంగా చూస్తూ కనిపించారు ఫస్ట్ లుక్ లో. ఈ ఇది చూసిన కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు. నరేష్ గారు.. పవిత్రని భలే ముగ్గులో దించారు.. ముగ్గులో దించడం అంటే ఇదే.. ఇలా వరుసగా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మళ్ళీ పెళ్లి సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ ఈ రకంగానైన వచ్చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS