పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. ఇలా సినిమా టైటిల్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఒక వీడియో వదిలారు సీనియర్ నటుడు నరేష్. ఆ వీడియోలో పవిత్ర లొకేషన్ ని పెళ్లి చేసుకున్నట్లుగా వుంది. అంతకుముందు మించి ఏ వివరాలు ఇవ్వలేదు. పెళ్లి ఎప్పుడు జరిగింది ? ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది ? ఏమీ లేవు. ఏదో సినిమా షూటింగ్ వీడియోలా బ్యాగ్రౌండ్ లో నలుగురు జూనియర్ ఆర్టిస్టులు కనిపించారు. పవిత్ర నరేష్ సినిమా నవ్వులు చిందించారు. అసలు జరిగింది పెళ్ళా.. లేదా ప్రచారం కోసం చేసుకున్నారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒక సీనియర్ నటుడు, అందునా సినీ వెటరన్ విజయ నిర్మల కొడుకు.. ఒక మాజీ హీరోయిన్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలాంటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే అది వార్తే. నరేష్ నుంచి ఒక పత్రిక ప్రకటన వుండాలి. అయితే ఉదయం వీడియో విడుదల చేసి ప్రెస్ నోట్ అనేసరికి ‘’నాకు రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఉన్నాయి. త్వరలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి దాకా ఓపిక పట్టండి’’ అంటూ ఓ వింత సమాధానం ఇచ్చారు నరేష్. ఇదంతా చూస్తే నరేష్ పెళ్లి డ్రామా అడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతునాయి,
నరేష్ వివాహాలు గురించి అందరికీ తెలిసింది. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నరేష్. మూడో భార్య రమ్య రఘుపతితో ఇంకా విడాకులు జరగలేదు. నరేష్ కి తాను విడాకులు ఇవ్వలేదని, తను పెళ్లి చేసుకుంటే కోర్టు వెళ్తానని ఆమె చెబుతుంది. చట్టపరంగా ఆమె బలంగానే వుందని వినిపిస్తోంది. అందుకే హోటల్ లో నరేష్ పవిత్ర ఏకాంతంగా వున్నపుడు మీడియా సాక్షిగా వారిని వెంబడించింది.
నరేష్ మాత్రం తనకు రమ్యతో సంబంధం లేదని చెబుతున్నాడు. తాజా పెళ్లి వీడియో కూడా రమ్యని వెక్కిరించడానికి, తన ఇగో ని తృప్తి పరుచుకోవడానికి మాత్రమే వదిలారని, ప్రెస్ నోట్ ఇస్తే.. మళ్ళీ అది లీగల్ చిక్కు వచ్చే అవకాశం వుందనే లాజిక్ తో తర్వలోనే చెబుతానంటూ జారుకున్నారని వినిపిస్తోంది.
అసలు త్వరలో చెప్పడం ఏమిటి ? పెళ్లి వీడియో రిలీజ్ చేసినప్పుడే చెప్పొచ్చుకదా? ఎవరి కోసం ఈ వీడియో విడుదల చేశారు ? ఇలాంటి ప్రచారం ఎందుకు కోరుకుంటున్నారు? పెళ్లి విషయంలో ఇంత డ్రామా అవసరమా ?! ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం వుంటుంది. అయితే పెళ్లిని కూడా ఇలా సినిమా పెళ్లిలా చిత్రీకరించడమే నవ్వులాటగా మారిపోయింది.