బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ యోగా పాఠాలు చెబుతోంది. బీచ్‌లో బికినీతో ఎంజాయ్ చేస్తే మానసికోల్లాసంతో ఆనందంగా ఉండొచ్చని అంటున్న ఈ బ్యూటీ, స్విమ్మింగ్‌కి యోగా తోడైతే ఆ ఫలితాలు ఇంకా గొప్పగా ఉంటాయని వివరించింది. చేతిలో తాబేలు (టార్టాయిస్)తో యోగా ముద్రలో నర్గీస్ ఫక్రీ యధేచ్ఛగా బికినీ గ్లామర్‌ని ఒలకబోసేస్తోంది ఈ ఫొటోలో. శరీరానికి కావాల్సినంత ఎనర్జీ సూర్యుడి ద్వారా లభిస్తుంది గనుక, లేలేత సూర్యకిరణాలు పడుతున్న సమయంలో బీచ్‌లో లేదంటే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ యోగాసనాలు వేయాలని సౌందర్య పాఠాలు వల్లిస్తోంది. ఆమె సౌందర్య పాఠాలెలా ఉన్నా, ఆమె అందాల్ని ఆస్వాదించే పనిలో కుర్రకారు యమా బిజీ అయిపోయారు. అంతలా కుర్రాళ్ళకు ఈ ఫొటో కిర్రాకు పుట్టించేస్తోంది.
ALSO SEE :
Qlik Here For Nargis Fakhri Latest Photos