నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో పట్టాలెక్కిన `నర్తనశాల` ఆగిపోయి, ఇప్పుడు ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ శనివారం శ్రేయాస్ ఓటీటీ ద్వారా `నర్తన శాల` విడుదల అవుతోంది. టికెట్ 50 రూపాయలు. ఇది సినిమా కాదు.కేవలం 2 సన్నివేశాలు మాత్రమే. అయితే `నర్తన శాల` సినిమాని ఎప్పటికైనా తీస్తానని బాలయ్య చెబుతున్నారు.
``ఇది నా కలల సినిమా. మధ్యలో ఆగిపోయింది. రెండు సన్నివేశాలు మాత్రమే తీయగలిగాం. సౌందర్య మరణంతో... ద్రౌపతి పాత్రకు ప్రత్యామ్నాయం దొరకలేదు. ఏమో... భవిష్యత్తులో నర్తన శాల తీస్తానేమో. ఈ ప్రాజెక్టు ఏ రూపంలో బయటకు వస్తుందో తెలీదు. తీసిన రెండు సన్నివేశాలైనా, కళాకారుల ప్రతిభ మరుగున పడిపోకూడదన్న ఉద్దేశంతో ఏటీటీ ద్వారా విడుదల చేస్తున్నాం`` అని ఓ వీడియోలో చెప్పుకొచ్చారు బాలకృష్ణ.