కొద్దిసేపటి క్రితం 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు సినిమాకి నాలుగు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా `కలర్ ఫొటో` ఎంపికైంది.
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) పురస్కారం `అల వైకుంఠపురములో`కి గానూ తమన్ కి దక్కింది. `నాట్యం` చిత్రానికిగానూ ఉత్తమ కొరియోగ్రఫీ (సంధ్యారాజు) ఉత్తమ మేకప్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఈసారి ఇద్దరికి అందించారు. సూర్య (సూరారై పోట్రు - తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అజయ్ దేవ్గన్ (తానాజీ) ఉత్తమ నటుడి అవార్డుని పంచుకోనున్నారు.
ఉత్తమ నటి (అపర్ణ), ఉత్తమ చిత్రం అవార్డుల్ని సైతం సూరారై పోట్రు దక్కించుకొంది. ఈ యేడాది 30 భాషల్లో 305 చిత్రాలు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. వీటిని ఏడు కేటగిరీలుగా విభజించి అవార్డుల్ని ప్రకటించారు.