రోజులు గడుస్తున్న కొద్దీ... రసవత్తరంగా మారిపోతోంది బిగ్ బాస్ షో. వారం వారం ఎలిమినేషన్ ప్రక్రియతో ఉత్కంఠత పెరిగిపోతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఉంటారు? ఎవరు బయటకు వెళ్లిపోతారు? అనే విషయంలో ఉత్కంఠత తెగడం లేదు. ఈవారం.. కూడా ఎలిమినేషన్ ప్రక్రియ మహా ఆసక్తిగా సాగింది. అనేక ఉత్కంఠ భరితమైన సన్నివేశాల నడుమ.. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా యానీ మాస్టర్ ఎలిమినేట్ అవుతారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. యానీ ఈసారి అవుట్ అని పక్కాగా అనుకున్నారంతా. కానీ.. నాగ్ ట్విస్ట్ ఇచ్చారు. నటరాజ్ ని ఎలిమినేట్ చేశారు. నటరాజ్ హౌస్ విడచి బయటకు వెళ్లిపోతున్నప్పుడు హౌస్ మేట్స్ బాగా ఎమోషనల్ గా ఫీలయ్యారు. దాంతో.. ఈవారం బిగ్ బాస్ హౌస్ లో మంచి డ్రామా నడిచినట్టైంది.
ఈ వారం ఎలిమినేషన్లో సన్నీ, కాజల్, లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియ ఉన్నారు. వీరిలో ఫైనల్ గా లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ మిగిలారు.చివరికి నటరాజ్ కి బై చెప్పాల్సివచ్చింది. ఆదివారం `నిన్నే పెళ్లాడతా` సినిమా విడుదలై పాతికేళ్లు. ఈ సందర్భంగా బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ అంతా నాగ్ కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా పాటలకు డాన్స్ చేస్తూ - నాగ్ ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయారు. ఈ సడన్ సర్‌ప్రైజ్ కి నాగ్ ఎమోషనల్ అవ్వడం - మరింతగా ఆకట్టుకుంది.