చిరంజీవి చేతిలో ఉన్న మరో రీమేక్ సినిమా `గాడ్ ఫాదర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన `లూసీఫర్`ని తెలుగులో `గాడ్ ఫాదర్`గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకుడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో పూరి జగన్నాథ్ చేయి వేస్తున్నారని సమాచారం. పూరికి చిరుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ కుదరడం లేదు. కాకపోతే.. `గాడ్ ఫాదర్` స్క్రిప్టులో తాను కూడా ఓ చేయి వేసి ఆ రూపేణ తన ముచ్చట తీర్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ కి అత్యంత ఇష్టమైన సినిమాల్లో `లూసీఫర్` ఒకటి. ఈ సినిమాని తెలుగులో చేస్తున్నారని తెలియగానే.. చిరుని పూరి కలిశార్ట. `నేను ఈ సినిమాని ఈ రేంజ్‌లో ఊహిస్తున్నా. మీరుంటే కొన్ని మార్పులు చేయాలి` అని చిరుకి సలహా ఇచ్చాడట పూరి. తను ఇచ్చిన సలహాలు చిరుకి నచ్చడంతో... మోహన్ రాజాతో కరెక్షన్స్ చెప్పి, .పూరి ఐడియాలజీ కి తగ్గట్టుగా కొన్ని సీన్లు రాయించాడట. అలా... పూరి ఈ స్క్రిప్టులో తల దూర్చినట్టు అయ్యింది.
`లూసీఫర్`ని ఉన్నది ఉన్నట్టు తీస్తే తెలుగులో వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు. మార్పులూ, చేర్పులూ చేయాల్సిందే. మరి పూరి సలహాలు ఈసినిమాకి ఎంత వరకూ పనికొచ్చాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడాలి.