తెలుగునాట అద్భుతాలు సృష్టించింది.. `ఆర్.ఆర్.ఆర్`. దేశవ్యాప్తంగా ప్రభంజనమై నిలిచింది. విదేశాల్లోనూ.. తన హవా చూపించింది. ఎన్నో అంతర్జాతీయ వేదికలపై పురస్కారాల్ని గెలుచుకొంది. ఇప్పుడు భారతీయుల కల.. ఆస్కార్‌కి చేరువైంది. బెస్ట్ వర్జినల్ సాంగ్ కేటరిగిలో `నాటు నాటు` పాట.. పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
ఈపాట ఇప్పుడు సెమీ ఫైనల్ లిస్టులో సెలెక్ట్ అయ్యింది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా 81 పాటలు పోటీ పడుతున్నాయి. అందులో 15 పాటలతో ఓ లిస్టు తయారు చేసింది ఆస్కార్ జ్యూరీ. అందులో నాటు నాటు పాటకి స్థానం దక్కింది. ఆస్కార్ పురస్కారాల టైమ్ దగ్గర పడుతున్న సమయంలో.. మరో లిస్టు తయారు చేస్తారు. అందులో 5 పాటల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాటిలోంచి ఓపాటకు ఆస్కార్ అందుతుంది. అంటే.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్‌లోని నాటు నాటు పాట... సెమీ ఫైనల్ లిస్టులోకి చేరిందన్నమాట.
ఫైనల్ లిస్టులో కూడా ఉంటే... ఆస్కార్ కల దాదాపుగా ఫలించినట్టే. అసలు ఈ కేటరిగిలో ఓ భారతీయ చిత్రం పోటీ పడడం ఇదే తొలిసారి. దానికి తోడు 15 పాటల షార్ట్ లిస్టులో తన పేరు చూసుకొంది ఆర్.ఆర్.ఆర్. ఇదే ఊపు కొనసాగితే.. ఈ కేటగిరీలో మనకు అవార్డు ఖాయం.