రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీ చాలా గొప్పగా ఉంటుంది. పైగా కూడా ఖర్చు పెట్టకుండా కోట్ల పబ్లిసిటీని ఈజీగా సంపాదించేస్తారు. అందుకే ఆయన సినిమాలకు అంత క్రేజ్. ఆర్.ఆర్.ఆర్‌తో మరోసారి బాక్సాఫీసుని శాశించారు రాజమౌళి. ఈ సినిమా 1000 కోట్ల మైలు రాయి దాటేసింది. థియేటర్లలో ఇంకా ఆడుతూనే ఉంది. ఈవారం కూడా బాక్సాఫీసు దగ్గర అన్నో ఇన్నో వసూళ్లు సాధించే సత్తా ఈ సినిమాకి ఉంది.
అయితే ఈ సినిమా నుంచి `నాటు నాటు` పూర్తి పాటని యూ ట్యూబ్‌లో విడుదల చేసేసింది చిత్రబృందం. ఆర్.ఆర్.ఆర్ ప్రధాన ఆకర్షణలలో ఈ పాట ఒకటి. ఎన్టీఆర్, చరణ్‌లు పోటీ పోటీగా స్టెప్పులు వేయడం చూడాలన్న ఆసక్తితో జనాలు థియేటర్లకు వెళ్తున్నారు. రిపీట్ ఆడియన్స్ పెరగడానికి ఆ పాట ఓ కారణం. అలాంటిది.. సినిమా థియేటర్లలో ఉండగానే పాట విడుదల చేసేసింది చిత్రబృందం. పాట కోసం థియేటర్లకు వెళ్లేవాళ్లకు ఇప్పుడు ఆ అవకాశం, అవసరం లేకుండా పోయాయి. అందుకే ఈ పాట విడుదల చేసి చిత్రబృందం తప్పు చేసిందని కొందరి భావన.
అయితే రాజమౌళి ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. ఈ పాటని చూసి, ఇప్పటి వరకూ సినిమా చూడని వాళ్లెవరైనా ఉంటే, వాళ్లు థియేటర్లకు కదులుతారని రాజమౌళి భావించి ఉండొచ్చు. ఏమో చెప్పలేం. ఆయన మాస్టర్ మైండ్ అలాంటిది.