'జెర్సీ' ట్రైలర్‌ టాక్‌: 'అర్జున్‌' ఎక్కడా తగ్గలేదు.!

By Inkmantra - April 12, 2019 - 11:28 AM IST

మరిన్ని వార్తలు

అర్జున్‌ పాత్రలో క్రికెటర్‌గా నాని నటిస్తున్న తాజా చిత్రం 'జెర్సీ'. 'మళ్లీ రావా' ఫేం గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందింది. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ట్రైలర్‌ అయితే చాలా బాగా కట్‌ చేశారు. ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా సినిమా స్టోరీ మొత్తం ట్రైలర్‌లో రివీల్‌ చేసేశారు. క్రికెట్‌ అంటే ప్రాణమిచ్చే అర్జున్‌ ప్రేమ, పెళ్లి, కొడుకు, కెరీర్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌నీ సింపుల్‌గా చూపించేశారు. 

 

హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాధ్‌తో పెళ్లికి ముందు గాఢమైన రొమాన్స్‌నీ ట్రైలర్‌లో మిక్స్‌ చేశారు. పెళ్లి తర్వాత సహజంగానే ప్రతీ మగాడి జీవితంలోనూ ఉండే మోయలేని బరువు, బాధ్యతలతో ప్రాణంగా భావించిన క్రికెట్‌కి దూరమవుతాడు. భార్య, కొడుకు, ఇంటి ఖర్చులతో ఉద్యోగం లేక, చివరికి భార్య జీతంపై ఆధారపడే భర్తగా సతమతమవుతున్న తరుణంలో చూస్తుండగానే పదేళ్లు గడిచిపోతాయి. పదేళ్ల తర్వాత కోచ్‌ సత్యదేవ్‌ స్ఫూర్తితో మళ్లీ క్రికెట్‌ బ్యాట్‌ చేపడతాడు. 

 

కెరీర్‌లో అనుకున్న లక్ష్యాన్ని చేధించాలనుకుంటాడు అర్జున్‌. అప్పటికి 36 ఏళ్ల వయసుకొచ్చేసిన అర్జున్‌ ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు.? మెంటల్‌గా తాను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా.? లేదా.? తెలియాలంటే 'జెర్సీ' చూడాల్సిందే. ఇన్ని ఎమోషన్స్‌తో హార్ట్‌ టచ్చింగ్‌గా ఉన్న 'జెర్సీ' ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి 'అర్జున్‌'గా నాని రీల్‌ కెరీర్‌లోనూ, రియల్‌ కెరీర్‌లోనూ కూడా విజయం సాధిస్తాడా.? లేదా.? వేచి చూడాలి మరి.!

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS